ఇండియా ఫస్ట్…సిటిజన్ ఫస్ట్

12
- Advertisement -

ఇండియా ఫ‌స్ట్‌.. సిటిజ‌న్ ఫ‌స్ట్ అన్న ఆలోచ‌నా విధానాన్ని బడ్జెట్ స‌మావేశాల ద్వారా ముందుకు తీసుకువెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ మీడియాతో మాట్లాడారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక ప‌రిస్థితి అస్థిరంగా ఉంద‌ని, సాధార‌ణ ప్ర‌జ‌ల ఆశ‌యాలు, ఆశ‌ల‌కు త‌గిన‌ట్లు బ‌డ్జెట్ ఉంటుంద‌ని, ఆ ఆశ‌యాల‌కు తీసిపోని విధంగా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ఉంటుంద‌ని చెప్పారు. మ‌న బ‌డ్జెట్‌పైనే ప్ర‌పంచ దేశాలు దృష్టి పెట్టాయని వెల్లడించారు.

ప్ర‌పంచ ఆర్ధిక అంశాల‌పై విశ్వ‌స‌నీయ‌మైన సంస్థ‌లు కొన్ని పాజిటివ్ సందేశాలు చేశాయ‌న్నారు. తొలిసారి పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి మ‌హిళా రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. మ‌న ఆర్ధిక మంత్రి కూడా మ‌హిళే అని, రేపు ఆ మంత్రి దేశం ముందు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతార‌ని తెలిపారు. పార్ల‌మెంట్ ముందు విప‌క్ష నేత‌లు కూడా త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తార‌ని తెలిపారు మోడీ.

ఇవి కూడా చదవండి..

- Advertisement -