ల్యాండ్ టైటిలింగ్‌..సందేహమేలా?

15
- Advertisement -

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ద్వారా ఏదో జరిగిపోతుంది అని టీడీపీ ప్రచారం చేస్తుండగా వైసీపీ మాత్రం గతంలో టీడీపీ నేతలు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈ చట్టం గురించి ఓ పోస్ట్ చేసి దానిని డిలీట్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. వాస్తవానికి తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని తొలుత ఆవేదన వెళ్లగక్కిన సదరు అధికారి తర్వాత ఆ ట్వీట్‌ని డిలీట్ చేసి ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ అధికారి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించిన సమాధానం చెప్పలేకపోయారట సదరు మాజీ అధికారి.

ఇక దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి చెప్పిన అభ్యంతరంపై వివరణ ఇచ్చారు అధికారులు. ఏదైతే సమస్య లెవనెత్తారో ఆ భూమికి సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారితో పాటు ఆయన సోదరులకు భాగం ఉండటంతో వారు కూడా మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించామని, కానీ మాజీ అధికారి ఒక్కరే దరఖాస్తు చేసుకోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్పారు స్థానిక తహసీల్దార్. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ పై విష ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగానే కొంతమంది అతి చేసి , తర్వాత వెనక్కి తగ్గి అభాసు పాలయ్యారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:కేసీఆర్ బ‌స్సు తనిఖీ..

- Advertisement -