పఠాన్..రికార్డు కలెక్షన్స్‌

16
- Advertisement -

బాలీవుడ్డ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం పఠాన్. విడుదలకు ముందే వివాదాస్పదమైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద బొళ్తాపడుతుందా లేదా హిట్ కొడుతుందా అన్న సందేహాలు అందరిలో ఉండేవి. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ పఠాన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. బాద్ షా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది పఠాన్.

యాక్షన్ థ్రిల్లర్ సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి వస్తున్నారు. పఠాన్ అయిదు రోజుల్లో 542 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సరికొత్త రికార్డులని సృష్టించింది. అత్యంత వేగంగా 100 కోట్ల, 200 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ సినిమాగా పఠాన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

గతంలో షారుఖ్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా, పఠాన్ సినిమా అయిదు రోజుల్లోనే 550 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -