KTR:బీఆర్‌ఎస్ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి

15
- Advertisement -

బీర్ఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ ఉన్న‌ప్పుడే మంచిగా ఉండే అనుకునేటోళ్లు కారు గుర్తుకు ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…తంగళ్లపల్లి ప్రజలకు నా మీద కోపం వచ్చినట్లు ఉంది. మొన్నటి ఎన్నికల్లో కొంచెం మెజార్టీ తగ్గించారు. నేను తెలిసో తెలియకనో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండన్నారు.

రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు, కౌలు రౌతులకు పైసలిస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. మహిళలకు రూ. 2500, ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరికీ రూ. 4 వేలు అన్నాడు. తులం బంగారం, స్కూటీలని రేవంత్ రెడ్డి చెప్పిండు. రంగుల కలలాంటి సినిమా చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఐదు నెలల్లోనే ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయన్నారు.

బీజేపోళ్లు డైరెక్ట్‌గా 400 సీట్లు వస్తే మొత్తం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలంటే కచ్చితంగా పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఉండాలన్నారు. క‌రీంనగ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. ఆయనను తంగళ్లపల్లి చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెసోళ్లే గుర్తుపట్టరు అని ఎద్దేవా చేశారు.

Also Read:గురువు రమణయ్య ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్..

- Advertisement -