నాయిని నర్సింహా రెడ్డిని పరామర్శించిన ఈటెల..

103
minster etela

ఇటీవల మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని నర్సింహా రెడ్డిని శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కర్నే ప్రభాకర్ పరామర్శించారు. నాయిని ఆరోగ్యపరిస్థితిపై మంత్రి ఈటెల డాక్టర్లతో చర్చించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతానికి నాయిని నర్సింహారెడ్డికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని డాక్టరు వెల్లడించారు. ఆయన కోలుకొని వస్తారని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు. మంత్రి ఈటెల నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చేపారు.