గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ములుగు ప్రభుత్వ ఉద్యోగులు..

63
Green India Challenge

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సునీత ఏపిఓఈజిఎస్,మెరుగు వెంకట నారాయణ ఏపిడి డిఆర్డిఏ, సౌగాని రాజేష్ కుమార్ ఈజీఎస్ లు వెంకటాపూర్ మండలంలో పలుప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి తో మొక్కలు విరివిగా నాటారు.

పర్యావరణ పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ కావలి అంటే ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపిచ్చారు. వారు ఒక్కొక్కరు కలిసి ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. స్వంచందంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనందుకు ఎంపీ సంతోష్ కుమార్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.