ఈటల వ్యాఖ్యలు సత్యదూరం: కొప్పుల

37
koppula

ప్రభుత్వంపై, సీఎంపై విమర్శలు చేయడం శోచనీయం అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన కొప్పుల…. 2001లో టీఆరెస్ పార్టీ కేసీఆర్ పెడితే అనేకమంది 69 ఉద్యమంలో ఉన్న వాళ్ళు మమేకం అయ్యారు…. ఈటెల రాజేందర్ 2003 టీఆర్‌ఎస్స్ పార్టీలో చేరారని వెల్లడించారు. ఈటెల రాజేందర్ గౌరవం దక్కలేదు అనే మాటలు అత్యంత సత్యదూరం…. రాజేందర్ కు గౌరవం ఇచ్చారు కాబట్టే మొదట కమలాపూర్ లో టికెట్ ఇచ్చారుని తెలిపారు.

కేసీఆర్ కేబినెట్ లో ఈటెలకు ఎప్పుడు కూడా గౌరవం తగ్గలేదు… గడిచిన నాలుగు ఏళ్ల నుంచి ఈటెల అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. ఈటెల మాటలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లే…. ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేస్తున్న వాళ్లకు ఇప్పటికీ గౌరవం దక్కని వాళ్ళు పార్టీలో పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీ తో అనేక రకాలుగా ఈటెల లబ్ది పొందారు……వ్యాపారం అభివృద్ధి కోసం అసైన్డ్ భూములను కొన్నాను అని ఈటెల స్వయంగా ఒప్పుకున్నారు….ప్రభుత్వం ప్రజా- ప్రభుత్వ అవసరాల కోసం ల్యాండ్ అక్వజేషన్ చేస్తదిన్నారు. ఈటెల సంస్థ ప్రజల కోసం కాదు కదా!…ఎన్ని సార్లు అమ్మినా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది అని అసైన్డ్ యాక్ట్ చెప్తుందన్నారు. దళితుల నుంచి తక్కువ ధరకు భూములు కొనాలని ఎలా అనిపించిందని ప్రశ్నించారు.

50 లక్షల నుంచి కోటిన్నర రూపాయలకు ఎకరం పలికే భూమిని ఆరులక్షలకు ఎలా కొంటావ్ ఈటెల ? అని ప్రశ్నించారు. దేవరయంజాల్ దగ్గర దేవాదాయ భూములు కొన్నట్లు స్వయంగా అంగీకరించారు….ఎన్ని సార్లు ఈటెల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా మీ గౌరవానికి ఎక్కడా తగ్గలేదు.…జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ఈటెల రాజేందర్ ఉద్దేశమా? అన్నారు.

Miniser Gangula Kamalakar l Koppula Eshwar l B Vinod Kumar at Telangana Bhavan | Great Telangana TV