ఘర్ వాపసే..సొంత గూటికి ఈటల?

32
etela
- Advertisement -

గతంలో బి‌ఆర్‌ఎస్ లో కీలక నేతగా కొనసాగిన ఈటెల రాజేందర్.. ఆ తరువాత పార్టీలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటికి చేరుకున్నారు. అయితే ఈటెల పార్టీ మారినప్పటికి ఆయన మనసంతా బి‌ఆర్‌ఎస్ వైపే ఉందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నది మొదలుకొని.. ఇంతవరకు కూడా కాషాయ పార్టీలో ఆయనకు సరైన ప్రదాన్యత ఇవ్వలేదనే వాదన కూడా వినిపిస్తూనే ఉంది. దీంతో ఈటెల మళ్ళీ సొంత గూటికి చేరతారా అన్న ప్రశ్నలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. .

అయితే ఇలాంటి వార్తలను ఈటెల రాజేంద్ర ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికి నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా.. ఆయన మళ్ళీ పార్టీ మరబోతున్నారనే చర్చ జరుగుతూనే ఉంది. ఇక ఈ ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో సి‌ఎం కే‌సి‌ఆర్‌ పదే పదే ఈటెల రాజేంద్ర పేరు ప్రస్తావించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పథకాల రూపకల్పనలోను, అటు సంక్షేమ పథకాల రూపకల్పనలోను ఈటెల రహకారాన్ని గుర్తు చేశారు కే‌సి‌ఆర్. డైట్ చార్జీల విషయంలోనూ ఈటెల తో చర్చించాలని మంత్రులకు సూచించారు కే‌సి‌ఆర్. ఈ నేపథ్యంలో సభలోని పలువురు బి‌ఆర్‌ఎస్ నేతలు ఈటెల ను ఉద్దేశించి ఘర్ వాపసే అనే నినాదాలు కూడా చేశారు.

దీంతో ఈటెల ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు సి‌ఎం కే‌సి‌ఆర్ సుముఖంగానే ఉన్నారనే చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అయితే ఇదే వ్యాఖ్యలపై ఈటెల కూడా తనదైన రీతిలో స్పందించారు. తనది పార్టీ మారే వైఖరి కాదని, గతంలో బి‌ఆర్‌ఎస్ లోనూ సైనికుడిలా పని చేశానని, ఇప్పుడు బీజేపీలోనూ అదే విధంగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ మంత్రులు తనను చర్చకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని కూడా అన్నారు. అయితే ఈటెల ప్రస్తుతం పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చినప్పటికి, ఇంటర్నల్ గా ఆయన బి‌ఆర్‌ఎస్ వైపే చూస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయాల్లో ఎప్పుడు ఎలలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేము గనుక.. ఈటెల తిరిగి సొంత గూటికి చేరిన ఆశ్చర్యం లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -