ఈటలను అరెస్ట్ చేయాలి:కౌశిక్ రెడ్డి

41
congress

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. క‌రీంన‌గ‌ర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన… సీలింగ్ నిబంధ‌నలు ఉల్లంఘించి భూములు కొన్న ఈట‌ల‌ను అరెస్టు చేయాల‌న్నారు.

ఈటల కుటుంబం పేరుపై ఉన్న 140 ఎక‌రాల్లో 90 ఎక‌రాల‌ను వెంట‌నే ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని …సీలింగ్ చ‌ట్టం ప్ర‌కారం ఒక కుటుంబానికి 50 ఎక‌రాల భూమి కంటే ఎక్కువ ఉండొద్ద‌న్న నిబంధ‌న ఈట‌ల‌కు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు.

ఈట‌ల అక్ర‌మ ఆస్తులు, అవినీతి సొమ్ము వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని అప్పా జంక్ష‌న్ నుంచి చేవెళ్ల‌, గండిపేట వ‌ర‌కు అనేక చోట్ల ఈట‌ల పెద్ద మొత్తంలో భూములు కొన్నార‌ని, వాటిని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడుతామ‌ని చెప్పారు.