టాస్ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌..

42
csk

ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పియూశ్‌ చావ్లా స్థానంలో కేదార్‌ జాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు మహీ తెలిపాడు.

గాయం నుంచి కోలుకున్న వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు ఈ మ్యాచ్‌లోనూ విశ్రాంతినిచ్చినట్లు ఢిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ వివరించాడు. ప్రస్తుతం ఢిల్లీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై మూడు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి డీసీపై ప్రతీకారం తీర్చుకోవాలని ధోనీ సేన భావిస్తోంది. ఢిల్లీ సైతం అదే ఊపును కొనసాగించి రెండోసారి కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా, ఐపీఎల్‌లో డీసీ, సీఎస్‌కే జట్లు 21 సార్లు తలపడ్డాయి. చెన్నై టీమ్ 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఏడుసార్లు మాత్రమే గెలుపొందింది.