బండికి 9 ప్రశ్నలు వేసిన జీవన్ రెడ్డి..

82
trs

అసెంబ్లీలో మంత్రి కే టీ ఆర్ వివరణాత్మక ప్రసంగం తర్వాత ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయన్నారు పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి. టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన…..తెలంగాణ పచ్చబడుతుంటే నాలుగు దిక్కులా నుంచి విపక్ష నేతలు మా ప్రభుత్వం పై మిడతల దండు లాగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

బండి సంజయ్ పాదయాత్ర లో రోజూ టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధిస్తున్నారు……ముందు మోడీ దేశానికి ,తెలంగాణ ఇచ్చిన హామీల గురించి చెప్పాలని సంజయ్ కు నేను తొమ్మిది ప్రశ్నలు సంధిస్తున్నానని తెలిపారు జీవన్ రెడ్డి.

ముందు మోడీ చెప్పిన పదిహేను లక్షల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో వేయాలన్నారు. .తెలంగాణ కు పసుపు బోర్డు ,ట్రైబల్ యూనివర్సిటీ లు తీసుకురావాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి….బీజేపీ ఆంటే భారతీయ జలగల పార్టీ ,భారతీయ జెలస్ పార్టీ గా మారిందన్నారు. తెలంగాణ లో బాగా పాలన జరుగుతుంటే బీజేపీ నేతలు ఓర్చుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో డ్రామా కు తెరలేపుతున్నారు… నిరుద్యోగుల కోసం 65 రోజుల పాటు కార్యాచరణ అంటూ జుంగ్ సైరన్ అంటున్నారు ..అది కల్లెక్షన్ సైరన్ అన్నారు. మళ్లీ వసూళ్ల కోసమే ఈ కార్యాచరణ ఇచ్చారు…రేవంత్ అజీర్తి పోరాటం ..పదవీ ఆరాటం అన్నారు. హుజురాబాద్ ఫలితం తర్వాత బండి సంజయ్ ,రేవంత్ లను ఎర్రగడ్డ ఆస్పత్రి లో చేర్పించాలన్నారు.

రఘునందన్ తెలంగాణ నుంచి పోయిన కంపెనీ ల గురించి కాదు వచ్చిన కంపెనీల గురించి మాట్లాడాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కే టీ ఆర్….గణాంకాలు ఉన్నాయి …మేము చెప్పినవి కాదన్నారు. అరవింద్ మంత్రి కే టీ ఆర్ ,ఎమ్మెల్సీ కవిత ల పై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నాం అన్నారు. అబద్ధాలకు తాత ,అక్రమార్జన లో విజేత ధర్మపురి అరవింద్ అన్నారు.