చిరుతో మాస్ మహారాజా!

124
chiranjeevi
- Advertisement -

వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా మరోమూవీ గాడ్ ఫాదర్ షూటింగ్‌ ఊటిలో జరుగుతోంది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాతో పాటు మెహ‌ర్ ర‌మేశ్‌, బాబీ దర్శకత్వంలో సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

అయతే తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ర‌వితేజ మ‌రోసారి మెగాస్టార్ తో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరువ‌బోతున్నాడ‌ట. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాలో ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని వార్త టీ టౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

గతంలో చిరుతో కలిసి అన్నయ్య సినిమాలో నటించారు రవితేజ. చిరు సోదరుడిగా నటించి మెప్పించారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ ఒకవేళ నిజమైతే ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులుండవు.

- Advertisement -