చివరి శ్వాస వరకు నిజం కోసమే పోరాటం:సిద్ధూ

79
sidhu

పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా స్పందించారు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ. తన రాజీనామాపై పునరాలోచన లేదని…చివరి శ్వాస వరకు నిజం కోసమే పోరాటం చేస్తానని వెల్లడించారు.

అవినీతి మ‌ర‌క‌లు అంటిన వ్య‌క్తుల‌ను ప్ర‌భుత్వంలోకి తీసుకోవ‌డం సరికాదని…. వ్య‌క్తిగ‌త విష‌యాల కోసం జ‌రిగే యుద్ధం కాదని, సిద్ధాంతాల కోసం జ‌రుగుతున్న యుద్ధం అని, అవినీతి మ‌ర‌క‌లు అంటిన మంత్రుల‌ను తీసుకోవడం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని పేర్కొన్నారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌ సంక్షోభాన్ని ఎలా చక్కబెట్టాలో తెలియని స్థితిలో పడింది ఆ పార్టీ అధిష్టానం. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మీదే వదిలేసింది. దీంతో అత్యవసర కేబినేట్‌ భేటికి పిలుపునిచ్చిన ఆయన…ఏం చర్యలు తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.