బండి సంజయ్.. సొంత జిల్లాలో ఇంత వ్యతిరేకతనా ?

66
- Advertisement -
తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ వేస్తున్న ఎత్తులు, వ్యూహాలు అన్నీ ఇన్ని కావు. అధికారం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా కాషాయ పార్టీ సిద్దంగా ఉందన్న విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే ఇట్టే అర్థమౌతుంది. ఎమ్మెల్సీ కవితను అవినీతిలో ఇరికెంచేందుకు ప్రయత్నించడం, అలాగే అధికార టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం.. ఇక చెప్పుకుంటూ పోతే కాషాయ పార్టీ చేస్తున్న అక్రమ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. అయితే రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని తెలిసి కూడా కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు ప్రజల దృష్టిలో హాస్యాస్పదం గానే నిలుస్తున్నాయి.
ముఖ్యంగా ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను ప్రజలు ఆధరించే పరిస్థితి కనిపించడం లేదు. కానీ బీజేపీ మాత్రం బండి పాదయాత్రపై తాటాకు చప్పుళ్ళు గట్టిగానే చేస్తోంది. ఇప్పటివరకూ ఐదు సార్లు పాదయాత్ర చేపట్టినప్పటికి.. ఏ దశలోనూ ఆయన పాదయాత్రను ప్రజలు కన్సిడర్ చేయడం లేదనేది అన్నీ వైపులనుంచి ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ వ్యాఖ్యలకు ఆద్యం పోస్తూ.. బండి సంజయ్ సొంత ఇలాఖ కరీంనగర్ జిల్లాలోనే ప్రజలు ఆయనపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు.
తాజాగా కరీంనగర్ జిల్లాలోలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి వ్యతిరేకంగా రామడుగు మండలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు స్థానికులు.. జిల్లాలో కూడా ఆయా చోట్ల ఆయన పాదయాత్రను వ్యతిరేకత చూపుతున్నారు ప్రజలు. ఈ ఐదేళ్లలో కరీంనగర్ లో ఏం అభివృద్ది చేశారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కేంద్రం నుంచి ఏం నిద్ధులు తెచ్చారని, అసలు లోక్ సభ స్థానంలో ఉండి గెలిచిన జిల్లాకు ఏం మేలు చేశారని ప్రజలు తీవ్ర స్టయిలో ప్రశ్నిస్తున్నారు. దీంతో సొంత జిల్లాలోనే అభివృద్ది చేయలేని బండి సంజయ్.. ప్రజలను మద్దతు కోరే హక్కు లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని బట్టి బీజేపీ పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -