వియ్యంకులుగా మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్

154
manchu manoj

సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్, హీరో మంచు మనోజ్ లు వియ్యంకులుగా మారారు. అదేంటి వీరిద్దరికి పెళ్లిలు,పిల్లలు లేకుండానే ఎలా వియ్యంకులు అయ్యారని అనుకుంటున్నారా? ఈవిషయానికి సంబంధించి మంచు మనోజ్ ఓ ట్వీట్ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ టాంగో, జోయాలు డేట్ చేస్తున్నారు. మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లోనే ముహూర్తం పెట్టించి శుభ‌లేఖ‌లు వేయిస్తాం అని త‌న కామెంట్‌లో రాసాడు.

అయితే సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ ఇద్దిరి కుక్కలకు పెళ్లి చేస్తున్నట్లు తెలిపారు. రెండు కుక్కలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు మంచు మనోజ్. ప్రస్తుతం ఈరెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్ర‌హ్మాస్మి చిత్రంలో నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో చే్స్తున్నాడు. నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.