‘ఈ నగరానికి ఏమైంది’@2

45
e nagaraniki emayendi

పెళ్లి చూపులు తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ఈ నగరానకి ఏమైంది. సురేష్ బాబు నిర్మాణంతో తెరకెక్కిన ఈచిత్రం మంచి విజయం సాధించింది. నలుగురు కొత్త నటుల విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, భినవ్ గోమాతం, వెంకటేష్ కాకుమానులతో ఈసినిమాను తెరకెక్కించారు. అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. ఈ నగరానికి ఏమైంది చిత్రం 29జూన్ 2018 న విడుదలయింది.

ఈమూవీ విడుదలై నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. వివేక్ సాగర్ సంగీతం ఈచిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటి సినిమా పెళ్లి చూపులులతో మంచి విజయం సాధించిన తరుణ్ భాస్కర్ రెండవ చిత్రంతో సక్సెస్ సాధించాడు.