గ్రేటర్‌లో ప్రత్యేకంగా కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

33
Minister Etela Rajender

సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారని వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో కంటైన్ మెంట్ జోన్ లు ఏర్పాటు చేస్తామని రేపటి నుండి పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా లో దుష్పచారం బాధాకరం అన్నారు.

చెస్ట్ హాస్పిటల్ లో కి వచ్చిన పేషంట్ అనేక హాస్పిటల్ కి తిరిగిన తరువాత వచ్చారని తెలిపారు. అర్ధరాత్రి వచ్చినా కూడా చేర్చుకుని ఆక్సిజన్ ఇచ్చామని కానీ ఆయన గుండె జబ్బుతో చనిపోవడం బాధాకరమన్నారు.258 మందికి హెల్త్ వర్కర్స్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని… చెస్ట్ హాస్పిటల్ లో హీడ్ నర్స్ విక్టోరియా చనిపోయిందన్నారు.

హెల్త్ సెక్రెటరీ ఆఫీస్ లో 11 మందికి కరోనా సోకింది, అందరికీ గాంధీ లో చికిత్స జరుగుతుందన్నారు. ఒక్కరు చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేసే సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దన్నారు.తెలంగాణ లో ప్రస్తుతం 17081 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని… ఇందులో 3500 ఆక్సిజన్ పైప్ లైన్ సిద్ధంగా ఉందన్నారు. మరో 6500 బెడ్స్ రెండు రోజుల్లో అందిస్తాం అని తెలిపిన ఆటల…. మొత్తం 10 వేల బెడ్స్ ఆక్సిజన్ తో సిద్దం అవుతున్నాయని తెలిపారు.