మనోజ్ మంచు…‘వాట్ ది ఫిష్’

27
- Advertisement -

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘వాట్ ది ఫిష్’ తో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో పాటు ఈ చిత్రానికి కథ , స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘మనం మనం బరంపురం’ అనేది సినిమా ట్యాగ్ లైన్. ‘వాట్ ది ఫిష్’ హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్‌ విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు.

మనోజ్ ని విభిన్న గెటప్‌లలో ప్రజెంట్ చేస్తూ ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సీరియస్ లుక్ లో చేతిలో ఓ పెద్ద రంపంతో చాలా క్రేజీ గా కనిపించారు. బ్యాగ్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగరడం కూడా గమనించవచ్చు. ఇందులో వెన్నెల కిశోర్ పాత్ర చాలా క్రేజీ గా ఉంటుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది.

ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో జరిగింది, ఈ చిత్రం కోసం చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నికల్ టీం పని చేస్తుంది. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:7వ వారం నామినేషన్స్‌లో ఉంది వీరే

- Advertisement -