శ్రీను కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా జంబలకిడి పంబ

302
raviteja
- Advertisement -

`గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం `జంబ‌ల‌కిడి పంబ‌`. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. ఈ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ మ‌హరాజ్ ర‌వితేజ ఆవిష్క‌రించారు.

జంబ లకిడి పంబలో సిద్ది ఇద్నాని

అనంత‌రం ర‌వితేజ మాట్లాడుతూ “జంబ‌ల‌కిడి పంబ అనే టైటిల్‌ను విన‌గానే హిట్ అనే ఫీలింగ్ వ‌చ్చేసింది. టైటిల్ మాత్రం ఈవీవీగారిది వాడుకున్నారు. క‌థ మొత్తం కొత్త‌గా రాసుకున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే త‌ప్ప‌క హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం కుదిరింది. చిత్ర యూనిట్‌కి నేను ఆల్ ది బెస్ట్ కి బ‌దులు కంగ్రాట్స్ చెబుతున్నాను. ష్యూర్ హిట్ చిత్ర‌మ‌వుతుంది. శ్రీనివాస‌రెడ్డి కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలుస్తుంది. నిర్మాత‌ల‌కు మంచి లాభాలు రావాలి“ అని అన్నారు.

jambalakidi pamba

శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ “మా చిత్రాన్ని మేం జూన్ 14న విడుద‌ల చేయాల‌ని ముందు అనుకున్నాం. కానీ ఆ రోజు చాలా సినిమాలు విడుద‌ల‌కున్నాయి. జూన్ 22న అయితే మంచి థియేట‌ర్లు దొరుకుతాయ‌ని, మంచి ఓపెనింగ్స్ ఉంటాయ‌ని పెద్ద‌లు సూచించారు. వారి సూచ‌న మేర‌కు ఈ చిత్రాన్ని జూన్ 22న విడుద‌ల చేస్తున్నాం. మా చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌గారు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూసి గ్యారంటీ హిట్ చిత్ర‌మ‌ని ఆయ‌న చెప్ప‌డంతో మాకు కొండంత బ‌లం వ‌చ్చిన‌ట్ట‌యింది. ముందు నుంచీ సినిమా పెద్ద హిట్ అవుతుందనే న‌మ్మ‌కంతోనే ప‌నిచేశాం. ఇప్ప‌టిదాకా మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తున్న అంద‌రూ ఈ సినిమాను కూడా అలాగే ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను“ అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ “పాత `జంబ‌ల‌కిడి పంబ‌`కు, మా సినిమాకూ ఎలాంటి పోలిక ఉండ‌దు. కాక‌పోతే క‌థాప‌రంగా మాక్కూడా అదే టైటిల్ బావుంటుంద‌ని పెట్టాం. పాత సినిమాను ఇందులో పోల్చుకోవాల‌నుకోవ‌ద్దు. ఎక్క‌డా పోలిక‌లు ఉండ‌వు. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. శ్రీనివాస‌రెడ్డిగారి కోస‌మే మా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ప్రేక్ష‌కుల నాడి తెలిసిన వాళ్లం. అందుకే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకున్నాం. అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకునే అంశాలు చాలా ఉంటాయి. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను చూసి ర‌వితేజ‌గారు కంగ్రాట్స్ చెప్ప‌డం ఆనందంగా ఉంది. ఈ నెల 22న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం“ అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమా చేశారు. అంద‌రినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. సెన్సార్ యు/ఎ ఇచ్చింది. యువ‌త‌కు న‌చ్చే అంశాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి“ అని తెలిపారు. క‌థానాయిక సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వ‌చ్చింది. కుటుంబ స‌మేతంగా చూడాల్సిన చిత్ర‌మిది“ అని తెలిపారు.

ravi teja srinivas reddy

న‌టీన‌టులు:స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు. సాంకేతిక నిపుణులు: సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.

- Advertisement -