‘జంబ లకిడి పంబ’లో సిద్ది ఇద్నాని…

311
- Advertisement -

మోడల్ మరియు థియేటర్ ఆర్టిస్ట్‌ సిద్ది ఇద్నాని “జంబ లకిడి పంబ” అనే చిత్రం లో శ్రీనివాస్‌ రెడ్డి సరసన నటిస్తోంది… ఈ చిత్రానికి జేబీ మురళి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు… ఈ చిత్రం “మే”లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇదో చక్కటి వినోదం తో కూడిన రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కుతుంది. నటన ప్రాధాన్యం కలిగిన ఈ కథకు.. హీరోయన్ పాత్ర కోసం దేశం లోని చాలా రాష్ట్రలలో ఆడిషన్స్‌ చేసి, చివరిగా సిద్ది ఇద్నానిని హీరోయిన్‌గా తీసుకున్నాం అని డైరెక్టర్‌ తెలిపారు.

Siddhi Idnani to debut as a Heroine in Jamba Lakidi Pamba

నేను దేశంలోని చాలా ప్రదేశాలలో థియేటర్స్‌ ప్లే చేశాను. ముంబాయి లోని ప్రముఖ ఏజెన్సీ నన్నుఆడిషన్‌కు వెళ్ళమన్నారు. అయిన కొన్ని రోజులకి టెస్ట్‌ షూట్‌ చేసి నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి హీరోయిన్‌గా తీసుకున్నారు.. తెలుగు ఇండస్ట్రీలో ఒక గొప్ప చిత్రం ద్వారా పరిచయం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అని హీరోయిన్‌ సిద్ది ఇద్నాని అన్నారు.

Siddhi Idnani to debut as a Heroine in Jamba Lakidi Pamba

ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి,వెన్నెల కిషోర్‌, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రఘు బాబు, సత్యం రాజేష్‌, ధన్‌రాజ్‌, శకలక శంకర్‌, జయప్రకాష్ రెడ్డి, తనికెళ్ళ భరణి, హరి తేజ, హిమజ, సుధ, మధుమణి తదితరులు నటిస్తున్నారు.

Siddhi Idnani to debut as a Heroine in Jamba Lakidi Pamba

ఈ చిత్రాన్ని రవి, జోజోజోష్‌ ,యన్‌ శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. బి సురేష్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం శివం సెల్యులాయిడ్స్‌ మరియు మెయిన్‌ లైన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేషనల్‌ అవార్డు గ్రహిత గోపి సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు, డీఓపీ గా సతీష్‌ ముత్యాల, ఎడిటర్‌గా తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌గా రాజీవ్‌ నాయర్‌ చేస్తున్నారు. దర్శకత్వం: బీజే మురళి కృష్ణ.

- Advertisement -