వక్ఫ్‌ బిల్లు..సుప్రీంకు కాంగ్రెస్‌!

15
- Advertisement -

వక్ఫ్‌ బిల్లు 2025 పార్లమెంట్ ఉభయ సభల్లో అమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ .. మోడీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసింది. 2024 ఆగస్టులో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుండే రాజ్యాంగంపై మరో దాడి గా అభివర్ణిస్తూ వ్యతిరేకిస్తోంది.

ఈ నేపథ్యంలో మాట్లాడిన జైరాం రమేశ్.. వక్ఫ్ బిల్లుపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న సూత్రాలు, నిబంధనలపై మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

పార్టీ తరఫున జెనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కె. సి. వేణుగోపాల్ తో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు జైరాం రమేష్. ఈ బిల్లు రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించిందని.. ముసాయిదా తయారుచేస్తున్నాం. త్వరలోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సీఏఏతో పాటు ఆర్టీఐ చట్ట సవరణకు చేసిన వ్యాజ్యాలు కూడా విచారణలో ఉన్నాయని గుర్తు చేశారు.

Also Read:KTR: రాహుల్ చేతికే ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌లు

- Advertisement -