బోగస్,గోబెల్స్ ప్రచారం.. ఇవే గట్టెక్కిస్తాయా?

11
- Advertisement -

పొలిటిషయన్ అంటే ప్రజలకు నమ్మకం ఉండాలి. మాట ఇస్తే మడమ తిప్పని నైజం ఉండాలి. నాయకుడి మాటలే కాదు చేతలు కూడా ప్రజల చేత మాట్లాడించగలగాలి. అలాంటి వారి పట్ల ప్రజలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. కానీ ప్రజలను నమ్మించడం, ఆశల పల్లకిలో ఉరేగించడం అవసరం తీరాక చేతులేత్తేడం చేస్తే అలాంటి నేత నాయకుడు ఎలా అవుతాడు.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దీనిపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. టీడీపీ పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇస్తున్న హామీల ప్రస్తావన ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 25 ఏళ్ళ క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తాం’ అని హామీ ఇచ్చారట. 1999 లో ఆయన చెప్పిన మాటలు ఇవి అని కొందరు అంటున్నారు. అది జరిగిందా ? ఉద్యోగాలు ఇచ్చారా ? అంటే పూర్తిగా అవునవి చెప్పలేం. కానీ ఆయన ఓ విజనరీ లీడర్ అనే భజన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది.అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే పంపిస్తాం అని ఆయన చెప్పారట.అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు అనేది మరికొందరి వాదన.

రాష్ట్రానికి నేనే దిక్కు అనేలా … అమలు కాని హామీలు ఇచ్చి జనాలను మభ్యపెడుతున్నారు అంటూ చంద్రబాబు గురించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. పెన్షన్ల… విషయంలో కొందరు వృద్దులు పడుతున్న ఇబ్బందులను చూసి ఇలాంటి విమర్శలు కూడా పుట్టుకొస్తున్నాయి.జగన్ మోహన్ రెడ్డి ఇలా చేసింది లేదు కదా. ఆయన ప్రభుత్వంలో ఏ రైతు, వృద్ధులు ఇబ్బందిపడిన సందర్భాలు లేవు. ఎంతో మంది ఉన్నత చదువులు కూడా చదువుతున్నారు. చాలా మంది బాగా సెటిల్ అయ్యారు. కానీ జగన్ మాత్రం ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్టు పేరిట ప్రజల భూములు లాక్కుంటారంటూ’ అంటూ అబద్ధపు ప్రచారం ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు చాలా మందిలో ఉన్నాయి. అబద్దం, వంచన మాత్రమే అస్త్రాలు కాదు..జనాల్లో నమ్మకం సంపాదించడమే అసలైన అస్త్రం. ఇది జనాలకి తెలీదంటారా?.

Also Read:BJP:కొండాకు కొత్త భయం!

- Advertisement -