చేపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

25
- Advertisement -

నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహారంలో చేపలు కూడా ఒకటి. చికెన్, మటన్ వంటి వాటితో పోల్చితే చేపలు తినే వారిశాతం కొంతమేర తక్కువే. ఎందుకంటే చేపల నుంచి వచ్చే వాసన కొంత అలెర్జీని కలుగజేస్తుంది. అందుకే కొందరు చేపలు తినడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపరు. అయితే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి రకం చేపల్లోనైనా ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు కూడా చేపలలో మెండుగా ఉంటాయి. చికెన్, మటన్ వంటివాటితో పోల్చితే చేపలలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గాలనుకునే వారు చేపపను ఆహారంగా చేర్చుకుంటే ఎంతో మేలు. ఇక దృష్టిలోపం ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఆహారడైట్ లో చేపలను చేర్చుకుంటే మంచిది. ఇందులో ఉండే విటమిన్ ఏ, ఇ, ఏమైనో యాసిడ్స్ దృష్టి లోపాన్ని తగ్గించి కంటిచూపును పెంచుతాయి.

చేపలలో కాల్షియం, విటమిన్ డి.. కణజాలలను బలపరచడంతో పాటు ఎముకల పటుత్వానికి పెంచుతాయి. అందువల్ల కీళ్ల సమస్యలు, మోకాళ్ళ నొప్పులు వంటి సంస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంకా చేపలలో ఫాస్ఫరస్, అయోడిన్, ఫ్లోరిన్ వంటివాటితో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తింటే గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా చర్మం కాంతిని పెంచడంలో కూడా చేపలు ఎంతో మేలు చేస్తాయట. ఇంకా డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో కూడా చేపలు మంచి ఆహారంగా నిపుణులు పరిగణిస్తున్నారు. కాబట్టి నాన్ వెజ్ ప్రియులు చికెన్ మటన్ కంటే కూడా చేపలను ఆహార డైట్ లో చేర్చుకోవడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయట . చేపలు తినడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందట. కాబట్టి చికెన్, మటన్ వంటివాటి కంటే కూడా చేపలను తినడమే మేలని ఆహార నిపుణులు చెబుతున్న మాట.

Also Read:‘ఇండియా’ సభ రెడీ..మమతా హాజరవుతారా?

- Advertisement -