Harishrao:మార్పు మొదలైంది..BRSదే విజయం

11
- Advertisement -

రాష్ట్రంలో మార్పు మొదలైంది బీఆర్‌దే విజయం అని తేల్చి చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్.. కేసీఆర్ హయాంలో పెట్టుబడి సహాయాన్ని రైతుకు అందించాము కాంగ్రెస్ హయాంలో రైతు బంధు రాలేదు అన్నారు. కేసీఆర్ ఉండగా వాటర్ ప్రాబ్లమ్ లేదు,కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో మూడు రోజులకోసారి వాటర్ వస్తున్నాయన్నారు.

కరెంటు కోతలతో రాష్ట్రంలో మార్పు వచ్చింది,కాంగ్రెస్ వచ్చింది…కరెంటు కోతలు తెచ్చింది,ప్రజా పాలన అంటూ నిర్బంధం చేస్తున్నారన్నారు. ఐదు నెలల్లో ప్రజల కష్టాలు ప్రారంభం అయ్యాయి,ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు అయ్యాయి,మహాలక్ష్మి ఎందుకు అమలు కాలేదు అని ప్రశ్నించారు.

రైతు బంధు 15 వేలు,పంట బోనస్ 500,కౌలు రైతులకు 12,000 అమలు కాలేదు,పింఛన్లు ఎందుకు పెంచలేదు,ఇందిరమ్మ ఇళ్ళు అప్లికేషన్లు ఎందుకు ప్రారంభం కాలేదు,నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు.రైతులకు 24 గంటల కరెంటు మోసం ,ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 12,500 రూపాయలు బాకీ పడిందన్నారు.

జనవరి నెల పింఛన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగరకొట్టిందని,నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పలేదని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో చెప్పారు,ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న నాలుగు డి.ఏ లు ఇస్తామని ఇవ్వలేదు,ప్రజలు కాంగ్రెస్ పాలన వద్దు అంటున్నారు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది, నాకు రైతు బంధు అందలేదని వ్యవసాయ శాఖా మంత్రి చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ కంటే భక్తిపరుడు ఎవరైనా వున్నారా…?,కాంగ్రెస్,బీజేపీ హామీలు కోటలు దాటుతున్నాయన్నారు.కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది,కాంగ్రెస్,బీజేపీ పార్టీల కంటే బిఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు.

Also Read:BJP:కొండాకు కొత్త భయం!

- Advertisement -