ఓటమి భయంతో కుయుక్తులు?

13
- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. టీడీపీని గట్టెక్కించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పెన్షన్లు అందకుండా చేశారని బాబుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇక మరోవైపు వైసీపీ నేతలపై వరుస దాడులు అందరిని కలవరానికి గురిచేస్తున్నాయి. ఇక తాజాగా  డీబీటీ లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అపవాదును ముటగట్టుకున్నారు చంద్రబాబు.

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు తెచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. డీబీటీ పథకాలను అడ్డుకుంటూ ఈసీ ఉత్తర్వులను ఇవ్వాళ్టి వరకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.నిన్న అర్థరాత్రి అందుబాటులోకి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు రాగా హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని సంప్రదించారు అధికారులు. క్లారిఫికేషన్ కోసం ఈసీని కోరారు అధికారులు. అయితే ఇప్పటివరకూ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఈసీ. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు తెలిపారు.

ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరోవైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామన్న ఈసీ చెప్పినా దీని వెనకుంది టీడీపీ అని బయటపడిందని మండిపడుతున్నారు.

Also Read:బిగ్ రిలీఫ్…కేజ్రీవాల్‌కు బెయిల్

- Advertisement -