దేశంలో కొత్త‌గా 22,842 క‌రోనా కేసులు న‌మోదు..

53

దేశంలో కొత్త‌గా 22,842 క‌రో నా కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 25,930 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,30,94,529కి చేరింది. నిన్న క‌రోనాతో 244 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,48,817కి పెరిగిందని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,70,557 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటివరకు 90,51,75,348 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.