ముంబైపై ఢిల్లీ విజయం..

96
Delhi-Capitals

ఐపీఎల్ 2021లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 26, అశ్విన్ 20 నాటౌట్, హెట్మెయర్ 15 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, జయంత్, కృనాల్, బుమ్రా, కౌల్టర్ నైల్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత కష్టంగా మారాయి.