దేశంలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు..

90
india corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 35,551 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 526 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,22,943 యాక్టివ్ కేసులుండగా 89,73,373 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,38,648 మంది మరణించారు.

దేశంలో ఇప్పటివరకు 14,35,57,647 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 11,11,698 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.