అర్జున్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన బన్నీ!

70
allu

ఓ వైపు వరు సినిమాల్లో నటిస్తునూ మరోవైపు రౌడ్ క్లబ్ పేరుతో విజయ్ దేవరకొండ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ని త‌యారు చేసి సేల్ చేస్తున్నారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

గ‌తంలో విజ‌య్ తాను డిజైన్ చేసిన బ‌ట్ట‌ల‌కు అల్లు అర్జున్ కు బ‌హుమ‌తిగా పంపగా, వాటిని అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో వాడారు. తాజాగా మ‌రోసారి బ‌ట్ట‌లు పంపారు విజ‌య్.

దీంతో విజయ్‌కి థ్యాంక్స్ చెప్పారు బన్నీ. నువ్వు పంపిన బ‌ట్ట‌లు చాలా కంఫోర్ట్‌గా ఉన్నాయి. నువ్వు చూపించే ఈ ప్రేమ‌కు నా ధ‌న్య‌వాదాలు అన్నీ బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. విజయ్ పంపిన బట్టలు వేసుకున్న ఫోటోలను షేర్ చేశాడు బన్నీ. యంగ్ హీరోలు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.