క్రికెటర్ హరీశ్ రావు…

78
harishrao

టీఆర్ఎస్ ట్రబూల్ షూటర్,మంత్రి హరీశ్‌ రావు క్రికెటర్ అవతారమెత్తారు. ఎప్పుడు ప్రజా సమస్యలు,సమీక్షలతో బిజీగా ఉండే హరీశ్‌ సిద్దిపేట వాసులను అలరించారు. సిద్దిపేట మినీ స్టేడియంలో బుధవారం రాత్రి నిర్వహించిన టీ–20 ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొన్నారు.

ఈ మ్యాచ్‌లో సిద్దిపేట జిల్లా జట్టుకు మంత్రి హరీశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హైదరాబాద్‌ మెడికవర్‌ డాక్టర్స్‌ జట్టుకు డాక్టర్‌ కృష్ణకిరణ్‌ సారథ్యం వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హరీశ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మంత్రి 12 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.