దేశంలో 24 గంటల్లో 13,203 కరోనా కేసులు…

54
covid

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 13,203 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 131 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,84,182 కేసులు యాక్టివ్‌గా ఉండగా 1,03,30,084 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,53,470 మంది మరణించారు. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా 16,15,504 మందికి టీకా పంపిణీ చేశామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.