కావాలనే ఏపీలో విగ్రహాల ధ్వంసం: సుమన్

51
suman

ఏపీలో విగ్రహాలపై దాడి ఘటన విచారకరం అని సినీ నటుడు సుమన్ అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సుమన్…కొంతమంది కావాలనే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని దీనిని సీఎం జగన్‌, వైసీపీ సర్కార్‌కు అంటగట్టడం సరికాదన్నారు.

కరోనా పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ..పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేశారని.. రాష్ట్రం విడిపోయాక కూడా అదే తప్పు జరిగిందన్నారు.

ఏపీలో మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని తెలిపారు సుమన్‌. ప్రజలు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ సీఎంను ఎన్నుకున్నారని.. ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.