దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు…

68
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 23,529 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 311 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980కు చేరగా 3,30,14,898 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,77,020 యాక్టివ్ కేసులుండగా 4,48,062 మంది ప్రాణాలు కొల్పోయారు.

ఇప్పటివరకు 88,34,70,578 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా సెప్టెంబర్‌ 29 వరకు 56,89,56,439 నమూనాలను పరీక్షించామని ఐసీఎమ్మార్‌ తెలిపింది.