రిపబ్లిక్ డే…గ్రేటర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

122
anjani kumar
- Advertisement -

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు పోలీసులు. జనవరి 26వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

మొజంజాహి మార్కెట్‌ తాజ్‌ ఐల్యాండ్‌, చాపెల్‌ రోడ్డు టీ జంక్షన్‌, సైఫాబాద్‌ ఓల్డ్ పోలీసు స్టేషన్, బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మీనార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఆదర్శ్‌నగర్ ‌(న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌) వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ట్రాఫిక్‌ సిబ్బంది సూచించిన మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా సహకరించాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నగరవాసులను కోరారు.

- Advertisement -