దేశంలో 24 గంటల్లో 20,550 కరోనా కేసులు

52
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 286 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,44,853 కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,62,272 యాక్టివ్ కేసులుండగా 98,34,141 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,48,439 కు చేరింది.