మామిడి పండు తింటున్నారా..ఇవి తెలుసుకోండి!

17
- Advertisement -

మామిడి పండ్లను చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇతర పండ్లతో పోల్చితే రుచిలో మామిడిపండు అన్నిటికనే మిన్న. అందుకే మామిడిని పండ్లలో రారాజు గా అభివర్ణిస్తారు. వేసవిలో మాత్రమే లభించే ఈ పండును నేరుగా లేదా జ్యూస్ రూపంలో లేదా ముక్కలుగా చేసుకొని.. ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు. మామిడిపండులో ఫోలెట్ యాసిడ్, బీటా కెరోటిన్, జింక్, కాల్షియం.. ఇలా చాలా రకాల పోషకాలు సమృద్దిగా లభిస్తాయి. మామిడి పండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. తద్వార వేసవిలో డిహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో మామిడిపండు ఎంతగానో ఉపయోగ పడుతుంది. మామిడిలో ఉండే ఫైబర్ కారణంగా మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. ఇంకా ఇందులో ఉండే పోషకాలు రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతాయి. అలాగే గుండె ఆరోగ్యన్ని ప్రోత్సహిస్తుంది.

చర్మ సమస్యలను నివారిస్తుంది. కంటి ఆరోగ్యానికి మామిడి ఎంతో ప్రయోజనకరం. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి మామిడి పండును సరైన పద్దతిలో తినకపోతే నష్టాలు తప్పవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మామిడి పండులో ఫైటిక్ యాసిడ్ అనే సహజసిద్ద మూలకం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మామిడి పండును ఏ మాత్రం నేరుగా తినరాదు. దీనిని కనీసం 1-2 గంటల పాటు నీటిలో నానబెట్టిన తరువాతే తినాలి. నీటిలో నానబెట్టడం వల్ల ఫైనిక్ యాసిడ్ శాతం తగ్గుతుంది. ఇంకా వీటిని నీటిలో నానబెట్టి తినడం ద్వారానే అందులోని పోషకాలు సవ్యంగా శరీరానికి అందుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

దుష్ప్రభావాలు

వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి వీటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. వీటిని ఎక్కువగా తింటే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. అలాగే శరీరంపై వేడి గడ్డలు, దురద వంటి సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. కాబట్టి మామిడిపండ్లను మితంగా తినడమే మంచిది.

Also Read:కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గమైన బాగుపడిందా?

- Advertisement -