ప్రతిరోజు నడకతో ఆరోగ్యం!

49
- Advertisement -

నడక అనేది ప్రతిఒక్కరు చేసే సాధారణమైన చర్య. కానీ కొందరు కొద్దిపాటి దూరం కూడా నడవలేక అలసట చెందుతూ ఉంటారు. ఎక్కువ దూరం నడిచేసరికి ఆయాసం, నిస్సయహాత వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు నడక కంటే బైక్ లేదా కారు, బస్సువంటి వాటిలో ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకుంటూ ఉంటారు. ఒక కిలో మీటర్ దూరం ఉన్నా.. నడక కంటే వాహన ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అయితే కొద్ది దూరానికి నడక ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్లు నడిస్తే చక్కటి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. హెవీ వర్కౌట్స్ చేయడం కన్నా ప్రతిరోజూ నడకకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించడంలో నడక ఎంతోగానో ఉపయోగ పడుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

షుగర్ వ్యాధి ఉన్నవారికి నడక చక్కటి పరిష్కార మార్గం. మానసిక స్థితిని బలపరచడంలోనూ, ఒత్తిడిని తగ్గించడంలోనూ నడక ఎంతో మంచిది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. గుండెపోటు సమస్యలు రాకుండా కాపాడుతుంది. శరీర కండరాలను సమతుల్యంగా ఉంచుతూ ఒళ్ళు నొప్పులను దూరం చేస్తుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నా నడకకు ప్రతిరోజూ తప్పనిసరిగా సమయం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:వైసీపీలో చేరిన వీరశివారెడ్డి

- Advertisement -