యూకే విమానాల‌పై నిషేధం పొడిగింపు..

73
britan flight

బ్రిటన్​కు విమాన రాకపోకలపై నిషేదాన్ని పొడగించింది కేంద్రం. బ్రిటన్​కు విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని 2021 జనవరి 7వరకు పొడిగించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి వెల్లడించారు.కరోనా కొత్త స్ట్రెయిన్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

యూకేలో కొత్త వేరియంట్ ఆన‌వాళ్లు క‌నిపించిన త‌ర్వాత‌ పలు దేశాలు యుకే విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించాయి. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త ర‌కం వైర‌స్ కేసులు 20 న‌మోదు అయ్యాయి. మంగ‌ళ‌వారం ఆరు కేసులు న‌మోదు కాగా, ఇవాళ మ‌రో 14 కేసులు నమోదుకావడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.