చాహల్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన ధోని!

62
dhoni

రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్న చాహల్ – ధనశ్రీ దంపతులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న ఈ జంటకు ధోని-సాక్షి నుండి ఆత్మీయ స్వాగతం లభించింది.

కొత్త జంటను ఢిన్నర్‌కు ఆహ్వానించిన ధోని…ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ధోని సర్‌ప్రైజ్‌తో సంతోషాన్ని వ్యక్తం చేశారు చాహల్. ఇక ధనశ్రీ కూడా థాంక్యూ. ఇంతకంటే ఏం చెప్పగలను. ఇంట్లో ఉన్నట్టే అనిపించింది అని తెలిపారు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన చహల్‌ ఇప్పటి వరకు టీమిండియా తరపున 54 వన్డేలు, 45 టీ20లు ఆడాడు.