ధరలు పెరుగుతున్నా పట్టించుకోరు..కానీ సినిమాలపై ఆంక్షలా!

78
nani

సినిమా థియేటర్స్‌ ఓపెనింగ్‌పై హీరో నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్‌లో సినిమా చూడటం అనేది మన బర్త్ రేట్ , మన బ్లడ్‌లోనే ఉంది – ఇలాంటి కరోనా లాంటి సందర్భాల్లో అన్నిటి కన్నా ముందు థియేటర్స్‌ మూసేస్తారు , అన్నిటికన్నా లాస్ట్‌లో థియేటర్స్ తెరుస్తారు అని ప్రశ్నించారు నాని.

అంతేగాదు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమా అనే పాటికి బోలెడు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. సినిమా అంటే చిన్న చూపు అని వాపోయారు. తిమ్మరుసు సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన నాని ఈ కామెంట్స్ చేశారు.

ఒక ప్రేక్షకుడి గా చెపుతున్నా, మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ లేదన్నారు. థియేటర్ వ్యవస్థ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారని, వాళ్లంతా సఫర్ అవుతున్నారని నాని వాపోయారు. అందరూ కలసి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని నాని చెప్పారు.