రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్

142
sumanth

హీరో సుమంత్ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర కాగా పెళ్లికార్డుపై ఎస్‌(సుమంత్),పి(పవిత్ర) అని వచ్చేలా డిజైన్ చేశారు.

1999లో ప్రేమ కథా చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సుమంత్. తర్వాత వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2004లో కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకోగా తర్వాత మనస్పర్థలు రావడంతో 2006లో విడిపోయారు.

సుమంత్ న‌టిస్తున్న అన‌గ‌న‌గా ఒక రౌడీ అనే మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతుంది.