కార్తీకదీపం..మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్!

78
karthika deepam

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. 1003 ఎపిసోడ్స్ పూర్తిచేసుకోగా మోనితకు గట్టిగా క్లాస్ ఇస్తారు కార్తీక్. పెళ్లయిన వారిని ప్రేమించడం ఏంటని కడిగి పడేశారు. అయితే మోనిత మాత్రం కార్తీక్‌ని బెదిరిస్తూనే దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది.

మోనిత…దీపని పట్టుకుని వంటలక్కా నువ్వైనా చెప్పవే.. నాకు నీ మొగుడంటే పిచ్చే.. కావాలంటే నువ్వు మాతోనే ఉందువుగానీ.. నీ పిల్లల్ని నేను పోషిస్తాను అని కార్తీక్‌తో చెప్పగా ఆపే ప్రయత్నం చేస్తారు కార్తీక్. నా గర్భం సంగతి ఏంటీ.? ఇలాగే ఉండిపోవాలా? ఎలా ఉంటాననుకున్నారు అని అరుస్తుంది మోనిత. నోరు ముయ్ మోనిత.. నాకు తెలియకుండా జరిగింది కాబట్టి తప్పు నాది కాదు అని కార్తీక్ మండిపడటమే కాదు పీక కోసుకున్నా ఐ డోంట్ కేర్.. పెళ్లి అయినవాడ్ని ప్రేమించడమే తప్పు అని అరుస్తాడు కార్తీక్.

ఆస్తులు రాసి ఇవ్వమని అడగలేదు…ఒక్క తాడు కట్టమన్నాను అని మోనిత…కార్తీక్‌తో చెబుతూ దీపను ఇన్వాల్వ్ చేస్తుంది. దీపా నువ్వైనా చెప్పు నా జీవితాన్ని తలరాతని మార్చొద్దని చెప్పు.. చెప్పు అంటూ తలకొట్టుకుంటుంది. దీంతో కోపంతో మోనితపై అరుస్తుంది దీప. ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నావ్.. ప్రేమేంటే ప్రేమా? నిజమైన ప్రేమ ఎదుటి వారి సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటుంది. నువ్వు నా భర్తని దక్కించుకోవాలనుకున్నావ్. నిజంగా నువ్వు మనస్పూర్తిగా ప్రేమిస్తే ఆయన కుటుంబాన్ని వీధిలోకి లాగవు అని చెబుతుంది.

తర్వాత కార్తీక్ వెళ్లిపోతుండగా కార్తీక్.. వెళ్లకు కార్తీక్ అని ఏడుస్తూనే గట్టిగా పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ వదిలించుకుని వెళ్లిపోతాడు కార్తీక్. ఎక్కడికి పోయినా 25 తేదీన రావాల్సిందే కదా అంటూ చెబుతుంది మోనిత. ఆదిత్య అయోమయంగా చూస్తుంటే.. దీప, భాగ్యం మాత్రం.. అదీ చూద్దాంలే అన్నట్లుగా లుక్ ఇస్తారు. తర్వాత బాధపడుతున్న కార్తీక్‌ని ఓదారుస్తూ ఇవన్నీ నీటి మీద రాతలే.. వాటితో తలరాతలు ఏం మారవు అని ధైర్యం చెబుతుంది దీప.