Nani:రాజకీయ నాయకుడిగా ప్రముఖ హీరో

45
- Advertisement -

టాలీవుడ్ హీరో నాని రాజకీయ నాయకుడి గెటప్‌లో ఉన్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ ప్రచారంలో భాగంగానే తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.‘‘ఇది ఎన్నికల సీజన్‌. ఇందులో మనం ఎందుకు జాయిన్ కాకూడదు..డిసెంబర్‌ 7న మీ ప్రేమను మాకు ఇవ్వాలి. మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు..మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. మొత్తానికి రాజకీయ నాయకుడిగా మారిన హీరో నాని లుక్ చాలా బాగుంది.

కాగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబ‌ర్ 6న హాయ్ నాన్న యూఎస్ లో ఒక రోజు ముందుగానే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. వందకు పైగా థియేటర్స్ లో అక్కడ రిలీజ్ కాబోతుంది. అన్నట్టు ఈ సినిమా గురించి నెట్టింట ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంటే మెయిన్ హైలైట్ కానుందని, నాని కెరీర్​లో హాయ్ నాన్న మంచి ఎమోష‌న‌ల్ డ్రామాగా నిలుస్తుంద‌ని చెప్తున్నారు.

మొత్తమ్మీద ఈ సినిమా గురించి ప్రస్తుతం ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఈ మూవీని ఓటీటీలోకి థియేట్రికల్ రిలీజ్ తర్వాత 40 రోజులకు, లేదా జనవరి రెండో వారంలో తీసుకురానున్నారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా హాయ్ నాన్న పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read:డిహైడ్రేషన్..తిరిగి ప్రచారంలోకి ఎమ్మెల్సీ కవిత

- Advertisement -