ట్విట్టర్ బ్లూటిక్..అప్‌డేట్

215
Elon Musk on Blue Tick Subscription
- Advertisement -

ట్విట్టర్‌లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సీఈవో ఎలన్ మస్క్. కంటెంట్ మాడరేషన్‌లో భాగంగా ఫేక్ అకౌంట్స్‌పై దృష్టి సారించారు. రాజకీయ నాయకులు, హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీల ఫ్యాన్‌ పేజీకి సంబంధించిన అడ్మిన్ వివరాలను వెల్లడించాలని లేకుంటే ఆ అకౌంట్‌లను బ్లాక్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా తాత్కాలికంగా నిలిపివేసిన బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ తేదీని వెల్లడించారు సీఈవో ఎలన్ మస్క్‌. నవంబర్ 29 నుంచి బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ పునఃప్రారంభించబడుతుందని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం బ్లూటిక్ ఇవ్వడంపై చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.

అమెరికాలోని చాలా నకిలీ ట్విటర్ ఖాతాలు ఎనిమిది డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌ను పొందాయి. దీంతో ఇబ్బంది పడిన ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను బ్యాన్ చేసింది.

ఇక ట్విట్టర్‌లో సమూల మార్పుల్లో భాగంగా ఖర్చులను తగ్గించుకొనేందుకు తొలుత ఉద్యోగులపై వేటు వేశారు. తొలుత సంస్థలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగులను తొలగించిన మస్క్.. తాజాగా సుమారు 4వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -