‘వీరయ్య’ లో విషయముంటుందా ?

155
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ మీద మంచి అంచనాలు ఉన్నాయి. చిరు ‘ముఠామేస్త్రి’ తరహా మాస్ లుక్ లో కనిపించబోతున్న ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై కొన్ని అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో ఉన్నాయి. చిరు మాస్ లుక్ బాగానే ఉంది. మోషన్ టీజర్ తో వదిలిన గ్లిమ్స్ ఎట్రాక్ట్ చేసింది. అయితే అందరిలో ఈ సినిమా మీద ఉన్న పెద్ద సందేహం ఏమిటంటే అసలు కథేంటి ? ఇందులో కొత్తదనం ఉంటుందా ?

అవును ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఏంటనేది బయటకు రాలేదు. మేకర్స్ కూడా పక్కా మాస్ కమర్షియల్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు తప్ప సినిమాలో విషయం గురించి ఎక్కడా చెప్పడం లేదు. అలా అని ఇందులో విషయం లేకుండా ఉంటుందా ? అంటే నమ్మలేం. దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకోలేక పోయినా మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు బాబీ. ‘పవర్’, ‘అల్లుడు శీను’ కథలు క్లిక్ అయ్యాయి. కాకపోతే దర్శకుడిగా ఎంత వరకు మెప్పిస్తాడనే సందేహాలు మెగా ఫ్యాన్స్ కి కలుగుతున్నాయి.

ఈ సినిమాలో రవితేజ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. బహుశా బాబీ అన్న దమ్ముల కథతో ఏదైనా మాస్ కంటెంట్ చూపించబోతున్నాడా ? అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో వైపు ‘వీర సింహా రెడ్డి’ తో బాలయ్య కూడా సంక్రాంతి పోటీలో ఉన్నాడు. మరి వీరయ్యలో విషయముంటే బాలయ్య కి గట్టి పోటీ ఇచ్చి చిరు మెగా హిట్ అందుకోవడం ఖాయం. చూడాలి వీరయ్యలో అసలు ఎంత విషయం ఉందో ? మరి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -