కృష్ణ మరణం… ఆ వీడియో వైరల్ !

286
kcr
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో ఓ ప్రయివేటు హాస్పిటల్ లో చేరడం చేరిన కొన్ని గంటల్లో ఎవరూ ఊహించని విధంగా కన్నుమూయడం తెలిసిందే. నిన్న ఉదయం హాస్పిటల్ నుండి కృష్ణ పార్థీవ దేహాన్ని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అక్కడే సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు కృష్ణ గారికి శ్రద్దాంజలి ఘటిస్తూ మహేష్ ను కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేఖర్ రావు గారు కృష్ణ గారికి అంజలి ఘటిస్తూ మహేష్ కుటుంబాన్ని పరామర్శించారు.

మహేష్ , నమ్రత ల పక్కనే చాలా సేపు కూర్చొని వారిని ఓదారుస్తూ సమయం కేటాయించారు. అదే సమయంలో నటుడు నరేష్ సీఎం ఎదురుగా ఏదో నవ్వుతూ మహేష్ తో మాట్లాడుతుంటే వెంటనే కేసీఆర్ గారు ఆయన్ను కంట్రోల్ చేస్తున్నట్టుగా చేతిని చూపిస్తూ ఏదో చెప్పారు. ఆ వీడియో కట్ చేసి నరేష్ అంటే పడని కొందరు మహేష్ అభిమానులు దాన్ని సోషల్ మీడియా లో వైరల్ చేశారు.

మరికొంతమంది ఆ వీడియో ను పోస్ట్ చేస్తూ కృష్ణ గారు చనిపోతే నరేష్ నవ్వుతుండటం తెలంగాణా ముఖ్యమంత్రికి కోపం తెప్పించి ఉండొచ్చు అందుకే అలా రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఏదేమైనా నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కృష్ణ గారి మరణంలో నరేష్ , పవిత్ర లోకేష్ జంట హాట్ టాపిక్ అయింది. కృష్ణ గారి ఇంట్లో ఎక్కువ హడావుడి చేస్తూ నరేష్ వీడియోలో హైలైట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -