Twitter:టిక్ మార్క్‌ లేని స్టార్లు ఎవరంటే…!

27
- Advertisement -

గురువారం అర్థరాత్రి నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులతో సహా వినియోగాదారుల ప్రొఫైల్స్‌ నుండి టిక్ మార్క్‌ను తొలగించింది. గతేడాది ట్విటర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్‌…దానిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అందులో భాగంగా ఎవరైనా ట్విటర్‌ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలని గతంలోనే తెలిపారు.

అందులో భాగంగా గురువారం అర్థరాత్రి నుంచి డబ్బులు చెల్లించలేని కొంతమంది వ్యక్తుల ప్రొఫైల్‌ నుంచి టిక్‌ మార్క్‌ తొలగించారు. ఈ టిక్‌ మార్క్‌ కోసం వినియోగాదారుడు నెలకు $8డాలర్లు చెల్లించాలని కూడా తెలిపారు. ఇందులో వివిధ రకాల కలర్ రూపంలో ఉండే టిక్‌ మార్క్‌లను వివిధ డాలర్లకు వెచ్చించాలని ఎలన్ మస్క్‌ గతంలోనే తెలిపారు. అయితే తాజాగా ఇందులో భారతదేశం నుంచి ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్‌ లాంటి సంస్థల యొక్క బ్లూ టిక్‌లను తొలగించింది.

Also Read: LPG:దేశంలో రెట్టింపైన ఎల్పీజీ కనెక్షన్లు…

అంతేకాదు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్, క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ మరియు స్మృతి మంధాన లాంటి క్రీడాకారులకు కూడా బ్లూ టిక్‌ తొలగించారు. వీరితో రాజకీయ నాయకులైన అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, యోగి ఆదిత్య నాథ్, మమతా బెనర్జీ బ్లూ చెక్‌ పాయింట్‌లు కొల్పోయారు. వీరితో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎమ్), డీఎంకే వంటి పార్టీలకు సైతం టిక్ మార్క్‌ను తీసివేశారు.

Also Read: బ్రిటన్ డిప్యూటీ పీఎం రాజీనామా..!

ట్విటర్ 2009లోనే ఫేక్ ఆకౌంట్‌లను గుర్తించే వీలుగా బ్లూ టిక్‌లను ఉపయోగించింది. దీని ద్వారా ఫేక్ ఆకౌంట్‌లను నిలిపివేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు చెల్లించాలని మొదటి నుంచి చెప్పుకొచ్చారు.

- Advertisement -