త్రిపాత్రాభినయం.. కృష్ణ స్టైలే వేరు!

167
kumarraja
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీ ఓ శిఖరాన్ని కొల్పోయింది. వైవిధ్యమైన, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మృతిచెందారు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త దనాన్ని పరిచయం చేయడంలో ఆయనది అందేవేసిన చేయి. ఎంతో మంది నిర్మాతలను తయారు చేశారు కృష్ణ. ఆయన మృతితో ఓ శకం ముగియగా వెండితెరకు ఆయన చేసిన సేవలను అంతా స్మరించుకుంటున్నారు.

నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా దాదాపు 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి సేవలందించారు. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారంటే చిన్న విషయమేమీ కాదు. ఒకే సంవత్సరం 17 సినిమాల్లో నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు కృష్ణ.

ఇక తెలుగు తెరకు మల్టీస్టారర్, ద్విపాత్రాభియం పరిచయం చేసిన ఆయనకే చెల్లింది. ఎంతోమంది హీరోలు ద్విపాత్రాభినయం చేయగలిగారు కానీ అలాంటి సందర్భాల్లో త్రిపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటుడు కృష్ణ.

కుమార్‌రాజా,డాక్టర్‌ – సినీ యాక్టర్, రక్త సంబంధం,పగపట్టిన సింహాం వంటి సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. శంకర్ గురు అనే కన్నడ సినిమాను తెలుగులో కుమార్‌ రాజగా రీమేక్‌ చేసి తొలి త్రిపాత్రాభినయం సినిమా చేశారు కృష్ణ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. తర్వాత విజయనిర్మల దర్శకత్వంలో డాక్టర్ – సినీ యాక్టర్‌ అనే సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. అలాగే సిరిపురం మొనగాడు, బంగారు కాపురం,బొబ్బిలి దొర వంటి చిత్రాల్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు కృష్ణ.

ఇవి కూడా చదవండి..

- Advertisement -