తీన్మార్ మల్లన్నపై స్వామీజీ లక్ష్మీ కాంత శర్మ భక్తుల ఆగ్రహం..

63
Teenmar Mallanna

రెండు మూడు రోజుల నుండి మారుతి జ్యోతిష్యాలయం స్వామీజీ లక్ష్మీ కాంత శర్మపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసత్య ప్రచారమే కాక, డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారిని..వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసిన భక్తులు సికింద్రాబాద్‌లో మధురానగర్‌లోని స్వామీజీ సన్నిధాననికి చేరుకున్నారు. గురూజీ లక్ష్మీ కాంత శర్మ వల్ల మాకు మా కుటుంబాలకు మంచే జరిగాయి అని ఎలాంటి డబ్బులు తీసుకోలేదని,పరిహారం చెప్పి మాకు మంచి జరిగితే మేము గురుదక్షిణ ఇచ్చుకున్నామే తప్ప వేరే దీ ఏమి లేదన్నారు.

కొంత మంది డబ్బుల కోసం,స్వామీజీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్న తీన్మార్ మల్లన్నపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని వారు క్యూ టివి నిర్వహిస్తున్న మల్లన్న అలియాస్ నవీన్ స్వామిజీపై అసత్య ప్రచారాలు చేస్తూ (లక్ష్మీ కాంత శర్మ) పై అభాండం వేస్తున్నారని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌పై 50 మందికి పైగా స్వామీజీకి మద్దత్తుగా ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బయటకు వచ్చి స్వామీజీ కేసు పెట్టాడు..మేము విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో భక్తులు వెనుదిరిగారు.