పోలీస్ కస్టడీకి మల్లన్న

28
mallanna

తీన్మార్ మల్లన్నను ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. జోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ కేసులో మల్లన్న అరెస్ట్ కాగా ఇప్పటికే ఈ కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు విచరాణ చేపట్టారు. తాజాగా మల్లన్నపై గతంలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదుకాగా ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో భాగంగా మల్లన్న నుండి కీలక విషయాలను రాబట్టనున్నారు.

ఇప్పటికే తీన్మార్‌ మల్లన్నను తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో చిలకలగూడ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, క్రైంబ్రాంచ్‌ పోలీసులు నాలుగురోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ కోరగా.. కోర్టు ఒక్కరోజు అనుమతిచ్చింది. దీనిలో భాగంగానే నేడు విచారించనున్నారు.